breaking news
Bang Bang movie
-
బ్యాంగ్ బ్యాంగ్ సీక్వెల్లో మరోసారి..
సాక్షి, ముంబయి : బ్యాంగ్ బ్యాంగ్ మూవీలో అలరించిన గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, కత్రినాల జోడీ మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. 2014లో విడుదలైన బ్యాంగ్ బ్యాంగ్‌కు తెరకెక్కనున్న సీక్వెల్లో వీరిద్దరూ మరోసారి ఆన్‌స్ర్కీన్ కెమిస్ర్టీని పండించనున్నారు. బ్యాంగ్ బ్యాంగ్ రీలోడెడ్ పేరిట రూపొందే ఈ మూవీ పనులను చేపట్టేందుకు ఫాక్స్ స్టార్ హిందీ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఒరిజినల్‌కు సీక్వెల్‌గా దీన్ని రూపొందించరాదని మేకర్లు యోచిస్తున్నారు. బ్యాంగ్ బ్యాంగ్ ఫ్రాంచైజీకి దర్శకుడిని ఇంకా ఎంపిక చేయలేదని డైరెక్టర్‌ను ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిసింది. హాలీవుడ్ సూపర్‌హిట్ నైట్ అండ్ డేకు అధికారిక రీమేక్‌గా తెరకెక్కిన బ్యాంగ్ బ్యాంగ్‌కు సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. -
మూడు రోజుల్లోనే రూ. 71.72 కోట్ల వసూళ్లు
న్యూఢిల్లీ: హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తోంది. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ. 70 కోట్ల మార్క్ దాటింది. ఒక్క మనదేశంలొనే మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 71.72 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల స్థాయిని దాటేసింది. రూ.140 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'బ్యాంగ్ బ్యాంగ్'లో హృతిక్ కు జంటగా కత్రినా కైఫ్ నటించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది.