ఉగ్ర నరసింహ! | Balakrishna's Jai Simha Movie First Look - Motion Poster release | Sakshi
Sakshi News home page

ఉగ్ర నరసింహ!

Nov 2 2017 12:40 AM | Updated on Aug 29 2018 1:59 PM

Balakrishna's Jai Simha Movie First Look - Motion Poster release - Sakshi

దాన.. వీర.. శూర.. కర్ణ... నరసింహుడతడు! కానీ, కత్తిపట్టి సింహంలా రంగంలోకి దూకాడో... శత్రువులు శరణు కోరాల్సిందే. సింహం ముందు లొంగిపోవాల్సిందే. దానవీర శూరకర్ణుడు లాంటి వ్యక్తి కసితో రగిలే నరసింహుడిలా ఎందుకు మారాడు? అసలేమైంది? ఉగ్ర నరసింహ అవతారంలో బాలకృష్ణ ఏం చేశారు? అనేది వచ్చే సంక్రాంతికి తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సి. కల్యాణ్‌ నిర్మిస్తున్న సినిమా ‘జై సింహా’.

బుధవారం ఈ సినిమాలో బాలకృష్ణ ఫస్ట్‌ లుక్, టైటిల్‌ లోగో, మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్‌ ఫైట్, సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లోని కంటైనర్‌ యార్డులో పూర్తి చేశారు. త్వరలో చిత్రీకరణ అంతా పూర్తి చేసి, సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్రానికి కథ–మాటలు: యం. రత్నం, సంగీతం: చిరంతన్‌ భట్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: సి. వరుణ్‌కుమార్‌–సి. తేజ, సహనిర్మాత:
సీవీ రావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement