సంక్రాంతిని శాసించే... డిక్టేటర్! | Balakrishna's Dictator wraps up talkie part | Sakshi
Sakshi News home page

సంక్రాంతిని శాసించే... డిక్టేటర్!

Dec 2 2015 12:07 AM | Updated on Aug 29 2018 1:59 PM

సంక్రాంతిని శాసించే... డిక్టేటర్! - Sakshi

సంక్రాంతిని శాసించే... డిక్టేటర్!

సంక్రాంతి సంరంభానికి బాలకృష్ణ ‘డిక్టేటర్’గా సమాయత్తమవుతున్నారు.

సంక్రాంతి సంరంభానికి  బాలకృష్ణ ‘డిక్టేటర్’గా సమాయత్తమవుతున్నారు. ఇప్పటి వరకు సంక్రాంతి రేసులో బాలకృష్ణ ఎక్కువ విజయాలు అందుకోవడంతో ‘డిక్టేటర్’పై అంచనాలు రెట్టింపయ్యాయి. రానున్న సంక్రాంతికి బాలయ్య బాక్సాఫీస్‌ను శాసిస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘లౌక్యం’తో గోపీచంద్‌కు మంచి విజయాన్ని అందించిన దర్శకుడు శ్రీవాస్ హీరో బాలకృష్ణను ‘డిక్టేటర్’గా స్టయిలిష్ లుక్‌లో చూపిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో  అంజలి, సోనాల్‌చౌహాన్, అక్ష నాయికలు.

శ్రీవాస్ మాట్లాడుతూ - ‘‘ఢిల్లీ, హర్యానాల్లో జరిగిన షెడ్యూల్‌తో ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. ఇక ఒక పాట, ఒక యాక్షన్ ఎపిసోడ్ బ్యాలెన్స్ ఉన్నాయి. డిఫరెంట్‌గానే ఉంటూనే బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు సాగే యాక్షన్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమా పాటలను ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement