బాలయ్య సినిమాకు నో కట్స్‌ | Balakrishna Paisa Vasool Censor Completed | Sakshi
Sakshi News home page

బాలయ్య సినిమాకు నో కట్స్‌

Aug 24 2017 6:28 PM | Updated on Aug 29 2018 1:59 PM

బాలయ్య సినిమాకు నో కట్స్‌ - Sakshi

బాలయ్య సినిమాకు నో కట్స్‌

బాలకృష్ణ తాజా చిత్రం పైసా వసూల్‌ సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసేసుకుంది.

టాలీవుడ్‌ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం పైసా వసూల్‌ సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసేసుకుంది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ యాక్షన్‌ డ్రామాకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఎలాంటి కట్‌లు లేకుండా సినిమాకు బోర్డు క్లియరెన్స్ ఇవ్వటం విశేషం.
 
సెన్సార్‌ వర్గాల టాక్ ప్రకారం.. ఫ‍్యాన్స్‌ సరికొత్త బాలయ్యను చూడబోతున్నారట‌. మరోవైపు సినిమాను బోర్డు సభ్యులు ఆద్యాంతం ఆస్వాదించారని మేకర్లు చెబుతున్నారు. అయితే టీజర్‌, ట్రైలర్‌ చూసిన చాలా మంది సినిమాకు చాలా వరకు కత్తెర తప్పదని భావించినప్పటికీ అలాంటిదేం జరగలేదు. పూరీ సినిమాను చాలా స్టైలిష్ గా తెరకెక్కించాడని చెబుతున్నారు.
 
ఇప్పటికే డైలాగులతో హోరెత్తించిన బాలయ్య తన నట బీభత్సంతో థియేటర్లలో అభిమానులతో విజిల్స్ వేయించేందుకు సెప్టెంబర్‌ 1న థియేటర్లకు రాబోతున్నారు. శ్రియ, మస్కన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement