‘యన్‌.టి.ఆర్‌’కి బిగ్‌ టార్గెట్‌ | Balakrishna NTR Biopic Overseas Business | Sakshi
Sakshi News home page

Sep 14 2018 10:26 AM | Updated on Sep 14 2018 10:29 AM

Balakrishna NTR Biopic Overseas Business - Sakshi

నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న  సినిమా యన్‌.టి.ఆర్‌(బయోపిక్‌). ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా స్టార్ట్‌ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు సినీ రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ కావటంతో ఈ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఓవర్‌సీస్‌లో ఈ సినిమా దాదాపు 20 కోట్లు పలికినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంత ఎమౌంట్‌ను యన్‌.టి.ఆర్‌ తిరిగి వసూళు చేయగలదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమాలేవి ఓవర్‌సీస్‌లో ఈ స్థాయిలో వసూళ్లు సాధించలేదు. మరి యన్‌.టి.ఆర్‌తో బాలయ్య సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తాడేమో చూడాలి.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించేశారు. ఒక్కో పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తూ సినిమా మీద హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్‌, చంద్రబాబులకు సంబంధించిన స్టిల్‌ను రిలీజ్‌ చేశారు. ఎన్టీఆర్‌గా బాలయ్య, చంద్రబాబు పాత్రలో రానా కనిపిస్తుండగా ఎన్టీఆర్‌ సతీమణి బసవ తారకం పాత్రలో విద్యాబాలన్‌ నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement