బోయపాటి చిత్రం: విలన్‌గా బాల​య్య?

Balakrishna Not Playing Negative Role In Boyapati Movie Says Movie Unit - Sakshi

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ నుంచి చిత్రానికి సంబంధించిన అనేక వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. లీకువీరులు ఈ సినిమా కథ, పాత్రల గురించి ఎప్పటికప్పుడు లీకులు అందిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో డ్యుయల్‌ రోల్‌ పోషిస్తున్న బాలయ్య ఓ పాత్రలో భాగంగా విలన్‌ పాత్రలో కనిపిస్తాడని టాలీవుడ్‌ హాట్‌ టాపిక్‌. 

ఈ సినిమాలో విలన్‌ పాత్రను బలంగా రూపొందిస్తున్నారట బోయపాటి. అయితే బాలయ్య వంటి హీరోను ఢీ కొట్టడానికి అవతల కూడా బాలయ్యనే ఉండాలని దర్శకుడు భావిస్తున్నాడట. దర్శకుడి ఆలోచనకు ఈ నందమూరి హీరో కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తల వచ్చాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్‌ నుంచి వచ్చిన అనధికారిక సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలయ్య విలన్‌గా కనిపంచట్లేదట. సినిమా మొదలైన కొన్ని నిమిషాల పాటు నెగటీవ్‌ షేడ్స్‌లో కనిపిస్తారని కానీ విలన్‌ కాదని అంటున్నారు. 

ఇక ఈ చిత్రంలో భూమిక చావ్లా పవర్‌ఫుల్‌ లేడీ విలన్‌ పాత్ర పోషిస్తున్నారని మరో వార్త ప్రచారంలో ఉంది. అయితే ఈ చిత్రంలో విలన్‌ పాత్ర గురించి స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు ఆడిపాడనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం అంజలి, శ్రియాలను చిత్ర బృందం ఎంపిక చేసిందని టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌. ఇప్పటికే చిత్ర షూటింగ్‌ వారణాసిలో ప్రారంభమైంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ వాయిదాపడింది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందిస్తున్నాడు. 

చదవండి:
బాలయ్య సినిమాలో లేడీ విలన్‌?
అందుకే ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చేలా టైటిల్‌ పెట్టాం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top