ఇక వేటే | balakrishna new movie ruler teaser launch | Sakshi
Sakshi News home page

ఇక వేటే

Nov 22 2019 12:17 AM | Updated on Nov 22 2019 5:12 AM

balakrishna new movie ruler teaser launch - Sakshi

బాలకృష్ణ, వేదిక

‘‘ఒంటి మీద ఖాకీ యూనిఫామ్‌ ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫామ్‌ తీశానా... బయటకు వచ్చిన సింహంలా ఆగను. ఇక వేటే’’ అని ‘రూలర్‌’ టీజర్‌లో విలన్‌కు పవర్‌ఫుల్‌ వార్నింగ్‌ ఇస్తున్నారు బాలకృష్ణ. కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రూలర్‌’. సోనాల్‌ చౌహాన్, వేదిక కథానాయికలు. సి. కల్యాణ్‌ నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ గురువారం రిలీజ్‌ అయింది. టీజర్‌లో రెండు డిఫరెంట్‌ గెటప్స్‌తో బాలకృష్ణ కనిపించారు. డిసెంబర్‌ 20న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్‌ భట్‌.

Advertisement
 
Advertisement
Advertisement