బాలయ్య అభిమానులకు దసరా కానుక | Bala Krishna Special Gift for his Fans on dussera | Sakshi
Sakshi News home page

బాలయ్య అభిమానులకు దసరా కానుక

Sep 13 2016 4:08 PM | Updated on Sep 29 2018 5:52 PM

బాలయ్య అభిమానులకు దసరా కానుక - Sakshi

బాలయ్య అభిమానులకు దసరా కానుక

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి. ఈ సినిమా బాలయ్య వందో చిత్రం కావటంతో మేకింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ ప్రతిష్టాత్మకంగా...

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి. ఈ సినిమా బాలయ్య వందో చిత్రం కావటంతో మేకింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హేమమాళిని, శ్రియలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల క్రిష్ పెళ్లి కారణంగా బ్రేక్ తీసుకున్న యూనిట్, ప్రస్తుతం తిరిగి షూటింగ్ కార్యక్రమాలతో బిజీ అయ్యింది.

ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్తో సెన్సేషన్ సృష్టించిన గౌతమీ పుత్ర శాతకర్ణి టీం దసరా సందర్భంగా అభిమానులకు మరో కానుకను ఇచ్చేందుకు రెడీ అవుతోంది. చారిత్రక నేపథ్యంతో భారీ గ్రాఫిక్స్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ను దసరా సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. క్రిష్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కంచె ఫేం చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement