పవన్ కళ్యాణ్తో లయన్ డైరెక్టర్ | Bala krishna lion director to direct pawan kalyans next film | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్తో లయన్ డైరెక్టర్

Mar 6 2016 12:52 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ కళ్యాణ్తో లయన్ డైరెక్టర్ - Sakshi

పవన్ కళ్యాణ్తో లయన్ డైరెక్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి అభిమానులకు షాక్ ఇచ్చాడు. కేవలం ఒక్క సినిమా.. అది కూడా బిలో యావరేజ్ సినిమా చేసిన దర్శకుడితో సినిమా చేయనున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి అభిమానులకు షాక్ ఇచ్చాడు. కేవలం ఒక్క సినిమా.. అది కూడా బిలో యావరేజ్ సినిమా చేసిన దర్శకుడితో సినిమా చేయనున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నందమూరి బాలకృష్ణ హీరోగా లయన్ సినిమాను తెరకెక్కించిన సత్యదేవ, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడట. ఈ విషయాన్ని సత్యదేవ స్వయంగా ప్రకటించారు.

గతంలో దాసరి నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా ఉంటుందని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ సినిమా  కోసం సత్యదేవ కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ 101 సినిమా కూడా తానే డైరెక్ట్ చేస్తానంటూ ప్రకటించాడు సత్యదేవ. పవన్ ప్రస్తుతం సర్థార్ గబ్బర్సింగ్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తరువాత సత్యదేవతో సినిమా చేస్తాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement