ఓల్డేజ్ హోంకు బాహుబలి సాయం | bahubali star prabhas donates rs 5 lakh to old age home | Sakshi
Sakshi News home page

ఓల్డేజ్ హోంకు బాహుబలి సాయం

Nov 15 2015 11:44 AM | Updated on Sep 3 2017 12:32 PM

ఓల్డేజ్ హోంకు బాహుబలి సాయం

ఓల్డేజ్ హోంకు బాహుబలి సాయం

టాలీవుడ్ స్టార్ హీరోలు రూట్ మారుస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు రూట్ మారుస్తున్నారు. ఇన్నాళ్లు జనాలతో కలవడానికి పెద్దగా ఇష్టపడని మన తారలు ఇప్పుడు అభిమానులను కలవడంతోపాటు, సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుండగా మరో యంగ్ హీరో ప్రభాస్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు.

బాహుబలి సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న ప్రభాస్ ఇటీవల వరుసగా ఫ్యాన్ మీట్లను ఏర్పాటు చేస్తున్నాడు. ఈ మధ్యే కమర్షియల్ బ్రాండింగ్లలో కూడా నటించటం మొదలు పెట్టిన ప్రభాస్, సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాడు. అందులో భాగంగా హైదరాబాద్లోని జీసస్ ఓల్డేజ్ హోంకు 5 లక్షల రూపాయల విరాళం అందించాడు.

బాహుబలి సక్సెస్ తరువాత గ్యాప్ తీసుకున్న ప్రభాస్, ప్రస్తుతం బాహుబలి 2 కోసం కండలు పెంచే పనిలో ఉన్నాడు. డిసెంబర్ రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. 2016 చివరకల్లా బాహుబలి 2ను ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement