బాహుబలి 2 : 1000 కోట్ల క్లబ్లో తొలి భారతీయ సినిమా | Bahubali 2, 1000 crores box office collection | Sakshi
Sakshi News home page

బాహుబలి 2 : 1000 కోట్ల క్లబ్లో తొలి భారతీయ సినిమా

May 7 2017 10:45 AM | Updated on Jul 14 2019 4:05 PM

గత శుక్రవారం రిలీజ్ అయిన బాహుబలి 2, ఇప్పటికీ కాసుల పంట పడిస్తోంది. విడుదలైన అన్ని చోట్లా హౌస్ ఫుల్

గత శుక్రవారం(28 ఏప్రిల్) రిలీజ్ అయిన బాహుబలి 2, ఇప్పటికీ కాసుల పంట పండిస్తోంది. విడుదలైన అన్ని చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే అన్ని రికార్డ్ లను బద్దలు కొట్టి ఇండియాస్ బిగెస్ట్ బాక్ల్ బస్టర్ గా నిలిచిన బాహుబలి 2, ఇప్పుడు సరికొత్త రికార్డ్ లను నెలకొల్పే దిశగా దూసుకుపోతుంది. ఈ ఆదివారం ఉదయానికి వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర తీసింది.

ఒక ప్రాంతీయ చిత్రం వంద కోట్ల వసూళ్లు సాధించటమే కష్టంగా ఉన్న సమయంలో 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డ్ సృష్టించింది బాహుబలి. శని, ఆదివారాల్లో కలెక్షన్లో ఊపందుకోవటంతో అనుకున్న సమయం కన్నా ముందే బాహుబలి 2 ఈ రికార్డ్ ను అందుకుంది. అంతేకాదు నార్త్ అమెరికా వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగానూ బాహుబలి రికార్డ్ సృష్టించింది. ట్రెడ్ ఎనలిస్ట్ అంచనాలను తలకిందులు చేస్తూ దూసుకుపోతున్న బాహుబలి ఫుల్ రన్ లో 1500 కోట్ల వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement