48 కట్స్ను 8 కి తగ్గించారు..! | Babumoshai Bandookbaaz censor cleared with 8 cuts | Sakshi
Sakshi News home page

48 కట్స్ను 8 కి తగ్గించారు..!

Aug 17 2017 12:01 PM | Updated on Sep 17 2017 5:38 PM

48 కట్స్ను 8 కి తగ్గించారు..!

48 కట్స్ను 8 కి తగ్గించారు..!

నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బాబు మొషాయ్ బందూక్ బాజ్' సినిమాకు గతంలో సెన్సార్ బోర్డ్ 48 కట్స్

నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బాబు మొషాయ్ బందూక్ బాజ్' సినిమాకు గతంలో సెన్సార్ బోర్డ్  48 కట్స్ సూచించిన సంగతి తెలిసిందే. నిబందనల పట్ల కఠినంగా వ్యవహరించిన అప్పటి సెన్సార్ బోర్డ్ చైర్మన్ పంకజ్ నిహ్లానీ  రక్తపాతం, శృంగారభరిత సన్నివేశాలకు వీలైనంతగా కత్తెర వేశారు. దీంతో బాబు మొషాయ్ టీం డైలామాలో పడింది.

సెన్సార్ బోర్డ్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన చిత్రయూనిట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ నుంచి బాబు మొషాయ్ చిత్రానికి రిలీఫ్ లభించింది. సెన్సార్ బోర్డ్ 48 కట్స్ సూచించిన ఈ సినిమాకు రివ్యూ కమిటీ కేవలం 8 కట్స్ మాత్రమే సూచించటం విశేషం. సెన్సార్ క్లియరెన్స్ లభించిన ఆనందంలో బాబు మొషాయ్ టీం మరో సాంగ్ ను రిలీజ్ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement