బాహుబలి 2 విడుదల ఎప్పుడో తెలుసా? | 'Baahubali - The Conclusion' to release on April 2017 | Sakshi
Sakshi News home page

బాహుబలి 2 విడుదల ఎప్పుడో తెలుసా?

Aug 5 2016 3:23 PM | Updated on Sep 4 2017 7:59 AM

బాహుబలి 2 విడుదల ఎప్పుడో తెలుసా?

బాహుబలి 2 విడుదల ఎప్పుడో తెలుసా?

బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ప్రకటించారు.

ముంబై: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 28 వరకు ఎదురుచూడకతప్పదు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న బాహుబలి 2 సినిమా ఆ రోజు విడుదల కానుంది. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ప్రకటించారు. కాగా ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా విడుదల తేదీని ప్రకటించాల్సివుంది.

బాహుబలి మొదటి పార్ట్ హిందీ వర్షెన్ను డిస్ట్రిబ్యూట్ చేసిన కరణ్ జోహార్.. రెండో పార్ట్ బాహుబలి-ది కన్క్లూజన్ హిందీ వర్షెన్ను కూడా డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్టు ప్రకటించారు. తన సంస్ధ ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిల్మ్స్తో కలసి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెప్పారు. కరణ్ జోహార్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయస్థాయికి చేర్చిన బాహుబలి సినిమా రికార్డులు కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. రెండో పార్ట్లోనూ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క నటిస్తున్నారు. బాహుబలి రెండో పార్ట్ పైనా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement