హిందీ 'వర్షానికీ' కలెక్షన్ల తుఫాన్‌! | Baaghi earns Rs 67.63 cr in ten days | Sakshi
Sakshi News home page

హిందీ 'వర్షానికీ' కలెక్షన్ల తుఫాన్‌!

May 10 2016 4:46 PM | Updated on Sep 3 2017 11:48 PM

హిందీ 'వర్షానికీ' కలెక్షన్ల తుఫాన్‌!

హిందీ 'వర్షానికీ' కలెక్షన్ల తుఫాన్‌!

టైగర్ ష్రఫ్‌, శ్రద్ధ కపూర్‌ జంటగా నటించిన తాజా సినిమా 'బాగీ'.

టైగర్ ష్రఫ్‌, శ్రద్ధ కపూర్‌ జంటగా నటించిన తాజా సినిమా 'బాగీ'... 'బాహుబలి' ప్రభాస్‌కు తొలి సూపర్ హిట్‌ను అందించిన 'వర్షం' సినిమాకు రీమేక్‌గా 'బాగీ' హిందీలో తెరకెక్కింది. కాస్తా యాక్షన్ డోసు ఎక్కువైన ఈ సినిమాలో మహేశ్‌బాబు బావ సుధీర్‌ విలన్‌గా నటించాడు.

ఈ సినిమా విమర్శకుల నుంచి, సినీ సమీక్షుల నుంచి మిక్స్‌డ్ స్పందన రాబట్టినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ వసూళ్లు రాబడుతున్నది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తొలి పదిరోజుల్లోనే రూ. 75 కోట్ల మార్క్‌కు చేరువగా వచ్చింది. ఇండియాలో 2,750 థియేటర్లు, విదేశాల్లో 344 థియేటర్లలో గత నెల 29న విడుదలైన 'బాగీ' పదిరోజుల్లో రూ. 67.63 కోట్లు రాబట్టింది.

రెండో వారాంతంలోనూ ఈ సినిమా నిలకడగా వసూళ్లు రాబడుతుండటం చిత్రయూనిట్‌ను సంతోషంలో ముంచెత్తుతున్నది. భారత్‌లో రెండో వారాంతంలో ఈ సినిమా వరుసగా శుక్రవారం రూ. 2.31 కోట్లు, శనివారం రూ. 2.43 కోట్లు, ఆదివారం రూ. 3.17 కోట్లు రాబట్టింది. మొత్తంగా తొలి పదిరోజుల్లోనే ఈ సినిమా పెద్దమొత్తంలో కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించిన బాలీవుడ్ ట్రెడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్‌ అదేవిధంగా ఈ ఏడాది తొలి వీకెండ్‌లో భారత్‌లో భారీగా వసూళ్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితాను ప్రకటించాడు. అవి
1. ప్యాన్‌
2. ఎయిర్‌లిఫ్ట్‌
3. బాగీ
4. కపూర్ అండ్ సన్స్‌
5. కి అండ్ కా

 

Advertisement
 
Advertisement
Advertisement