అయ్యప్ప పాటల వేడుక | Ayyappa Songs Celebration | Sakshi
Sakshi News home page

అయ్యప్ప పాటల వేడుక

Dec 17 2014 12:14 AM | Updated on Sep 2 2017 6:16 PM

అయ్యప్ప పాటల వేడుక

అయ్యప్ప పాటల వేడుక

అయ్యప్ప మహిమల నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘శ్రీమణికంఠ మహిమలు’. బి.వి.రమణారెడ్డి,

అయ్యప్ప మహిమల నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘శ్రీమణికంఠ మహిమలు’. బి.వి.రమణారెడ్డి, సుమన్, భానుచందర్, కవిత, జొన్నలగడ్డ శివ, సాయి మణికంఠ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వి.సాగర్ దర్శకుడు. బి.వి.అరుణారెడ్డి, సాయిమణికంఠరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీ వినాయక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి చేతుల మీదుగా శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న బి.వి.రమణారెడ్డి ఈ చిత్రానికి కథ, మాటలు కూర్చడమే కాక, కీలకపాత్ర పోషించడం అభినందనీయమని నాయిని అన్నారు. అయ్యప్ప అనుగ్రహం వల్లే ఈ చిత్రాన్ని నిర్మించగలిగామని బి.వి.రమణారెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వ అవకాశం రావడం పట్ల సాగర్ సంతోషం వెలిబుచ్చారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement