సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..? | Avika Gor says Goodbye To Films | Sakshi
Sakshi News home page

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

Dec 20 2016 1:19 PM | Updated on Sep 4 2017 11:12 PM

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా సక్సెస్లు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా సక్సెస్లు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే.. ఓ యంగ్ హీరోయిన్ మాత్రం కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుందట. ఇటీవల ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాతో మరో హిట్ అందుకున్న ఈ భామ తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా అంగీకరించలేదు.

అయితే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే నటనకు గుడ్ బై చెప్పనుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇటీవల ఓ యంగ్ హీరోతో వివాదంతో అవికా పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపించింది. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. అయితే కేవలం తెలుగు సినిమాలకు గుడ్ బై చెపుతుందా..? లేక నటనకే గుడ్ బై చెపుతుందా..? అన్న విషయంపై మాత్రం తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement