తెలుగు ప్రేక్షకులు నిజాయతీగా ఉంటారు

ashwamedam movie song release - Sakshi

ధ్రువ కరుణాకర్, శివంగి, సోనియా ముఖ్యతారలుగా తెరకెక్కిన చిత్రం ‘అశ్వమేథం’. నితిన్‌ .జి దర్శకత్వంలో ఐశ్వర్యా యాదవ్, ప్రియా నాయర్‌ నిర్మించారు. చరణ్‌ అర్జున్‌ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘గజానన’ అనే పాటను నిర్మాత ఐశ్వర్య యాదవ్‌  రిలీజ్‌ చేశారు. నితిన్‌ మాట్లాడుతూ– ‘‘గజానన’ పాటను తెరపై చూస్తున్నప్పుడు మేజికల్‌ మూమెంట్‌లాగా అనిపించింది. తెలుగు ప్రజలు టెక్నికల్‌గా ముందంజలో ఉన్నారు. నిజాయతీగా ఉంటారు.

సినిమా బావుంటే ఆదరిస్తారు. మా సినిమాని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు. చరణ్‌ అర్జున్‌ మాట్లాడుతూ– ‘‘చిన్ని చరణ్‌ పేరుతో చాలా సినిమాలకు సంగీతం అందించా. ఇప్పుడు చరణ్‌ అర్జున్‌ అని పేరు మార్చుకున్నా. ఈ చిత్రంలోని ‘గజానన’ పాటతో రీ లాంచ్‌ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘తెలుగులో హీరోగా లాంచ్‌ కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు ధ్రువ కరుణాకర్‌. ఐశ్వర్య యాదవ్, ప్రియా నాయర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: నగేష్‌ పూజారి, లైన్‌ ప్రొడ్యూసర్‌: సైపు మురళి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top