రాఖీ సావంత్‌కు అరెస్టు వారెంటు | arrest warrant issued against Rakhi Sawant for remarks on Sage Valmiki | Sakshi
Sakshi News home page

రాఖీ సావంత్‌కు అరెస్టు వారెంటు

Apr 3 2017 10:34 AM | Updated on Aug 20 2018 4:35 PM

రాఖీ సావంత్‌కు అరెస్టు వారెంటు - Sakshi

రాఖీ సావంత్‌కు అరెస్టు వారెంటు

బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్‌కు లూధియానా కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది.

బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్‌కు లూధియానా కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. రామాయణం రాసిన వాల్మీకి మహర్షి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఈ వారంటు జారీ అయింది. గత సంవత్సరం ఓ ప్రైవేటు టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో వాల్మీకి మహర్షి మీద ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల వాల్మీకు కులస్థులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

రాఖీసావంత్‌ను అరెస్టు చేసేందుకు లూధియానాకు చెందిన ఇద్దరు పోలీసుల బృందం అరెస్టువారంటుతో ముంబై వెళ్లిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలని పదే పదే సమన్లు పంపినా ఆమె రాకపోవడంతో మార్చి 9వ తేదీన వారంటు జారీ అయింది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 10వ తేదీన ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement