వారి దారిలో వెళ్తాను : పూర్ణ | Archana, Shabana Azmi are inspirational to me, says Poorna | Sakshi
Sakshi News home page

వారి దారిలో వెళ్తాను : పూర్ణ

Oct 5 2013 1:16 AM | Updated on Aug 28 2018 4:30 PM

వారి దారిలో వెళ్తాను : పూర్ణ - Sakshi

వారి దారిలో వెళ్తాను : పూర్ణ

‘‘అందం ఎదుటివారిని త్వరగా ఆకర్షిస్తుంది. కానీ ఒక నటిని నిలబెట్టేది మాత్రం నటనే’’ అంటున్నారు అందాల భామ పూర్ణ. గ్లామర్ డోస్ తక్కువ అవడం వల్లే మీకు అవకాశాలు అనుకున్న స్థాయిలో రావడంలేదేమో! అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా పూర్ణ పై రీతిలో స్పందిస్తున్నారు.

‘‘అందం ఎదుటివారిని త్వరగా ఆకర్షిస్తుంది. కానీ ఒక నటిని నిలబెట్టేది మాత్రం నటనే’’ అంటున్నారు అందాల భామ పూర్ణ. గ్లామర్ డోస్ తక్కువ అవడం వల్లే మీకు అవకాశాలు అనుకున్న స్థాయిలో రావడంలేదేమో! అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా పూర్ణ పై రీతిలో స్పందిస్తున్నారు. ఇంకా చెబుతూ -‘‘ప్రతి ఒక్కరికీ టైమ్ వస్తుంది. నాకు రాలేదంతే. 
 
 మనం ఎంచుకునే పాత్రల బట్టే మన కెరీర్ ఉంటుందని నమ్ముతాన్నేను. నేను సెలక్టివ్‌గా సినిమాలు చేయడానికి కారణం అదే. ఇప్పటివరకూ నేను నటించిన ప్రతి సినిమా నాకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ‘అవును’కు ప్రశంసలు కూడా వచ్చాయి. 
 
 నేను అందంగా ఉంటానని చాలామంది అంటుంటారు. కానీ గ్లామర్ అనే పదంపై నేను అంత ఆసక్తి చూపను. అర్చన, షబానా ఆజ్మీ లాంటి నటీమణులే నాకు ఆదర్శం. వారిద్దరూ పెద్ద అందగత్తెలు కారు. కానీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. వారి దారిలోనే వెళ్లాలనుకుంటున్నాను’’ అని చెప్పు కొచ్చారు పూర్ణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement