అనుష్క 'సైజ్ జీరో' | Anushka's new film is Size Zero | Sakshi
Sakshi News home page

అనుష్క 'సైజ్ జీరో'

Feb 24 2015 1:25 PM | Updated on Sep 2 2017 9:51 PM

అనుష్క 'సైజ్ జీరో'

అనుష్క 'సైజ్ జీరో'

ఇప్పటికే పలు చిత్రాలతో తీరిక లేకుండా ఉన్న టాలీవుడ్ తార అనుష్క మరో మెగా ఫోన్ అందుకున్నారు.

వరుస చిత్రాలతో తీరికలేకుండా ఉన్న టాలీవుడ్ హీరోయిన్ అనుష్క...మరో సినిమాకు రెడీ అయిపోయింది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం నిర్వహిస్తున్న ఓ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటించనున్నారు.  పీవీపీ సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రానికి 'సైజ్ జీరో' అని పేరు పెట్టారు. ఇందులో ప్రధాన తారగణంగా అనుష్క, తమిళ నటులు ఆర్యా, భరత్, ఊర్వశి నటిస్తుండగా మరో ముఖ్య అతిథి పాత్రలో శృతిహాసన్ మెరవనుంది.

 

రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  కథా రచనను ప్రకాశ్ సతీమణి కనికా థిల్లాన్ అందించారు. ఈ సినిమా ముహుర్తపు సన్నివేశాన్ని రాఘవేంద్రరావు సోమవారం  దర్శకత్వం వహించగా...కెమెరా ప్రసాద్ వి పోట్లురి స్విచ్చాన్ చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది.  త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement