ఈ పూజలు ఎవరి కోసం? | Anushka Visits kadarnath Temple | Sakshi
Sakshi News home page

ఈ పూజలు ఎవరి కోసం?

May 4 2018 12:25 AM | Updated on May 4 2018 12:25 AM

Anushka Visits kadarnath Temple - Sakshi

అనుష్క

‘నాకు దైవ భక్తి ఎక్కువ. వీలు కుదురినప్పుడల్లా పుణ్యక్షేత్రాలకు వెళుతుంటాను’ అని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు అనుష్క. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ టెంపుల్‌ను సందర్శించారామె. అక్కడ కొన్ని ప్రత్యేక పూజలు కూడా చేయించారు అనుష్క. కేదార్‌నాథ్‌తో పాటు గంగోత్రి, బద్రీనాథ్‌ కూడా సందర్శించనున్నారట. సన్నిహితుల కోసం మొక్కుకుని గుడికి వెళుతుంటానని అనుష్క ఈ మధ్య ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గుడికి వెళ్లి తన కోసం తాను ఎప్పుడూ ఏమీ కోరుకోనని కూడా అన్నారు. మరి.. ఇప్పుడు ఎవరి కోసం గుడికి వెళ్లారో? లేక జస్ట్‌ ఖాళీ దొరికింది కాబట్టి పీస్‌ఫుల్‌గా ఉంటుందని వెళ్లారో?

Advertisement
 
Advertisement
Advertisement