స్పెషల్‌ సాంగ్‌ @ సెకండ్‌ టైమ్‌

anushka special song in sye raa narasimha reddy - Sakshi

‘ఐ వాంట్‌ ఏ స్పైడర్‌మ్యాన్‌’ అని గతంలో ఓసారి అనుష్క అడిగారు గుర్తుందా? చిరంజీవి నటించిన ‘స్టాలిన్‌’ చూసినవాళ్లు ఇది ఆ సినిమాలోని పాటే కదా అని చటుక్కున చెప్పేస్తారు. ఆ స్పెషల్‌ సాంగ్‌లో చిరు, అనుష్క వేసిన స్టెప్స్‌ను అంత సులువగా మరచిపోలేం. మళ్లీ  చిరంజీవితో మరో స్పెషల్‌ సాంగ్‌కి నర్తించడానికి అనుష్క రెడీ అయ్యారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార, తమన్నా కథానాయికలు.

చిరంజీవి గురువు పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ కనిపిస్తారు. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనున్నారు అనుష్క. పదమూడేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ చిరుతో కలసి ఆమె స్టెప్స్‌ వేయడం విశేషం. ఈ సాంగ్‌ షూటింగ్‌ ఈ నెలాఖరున జరగనుందని సమాచారం. సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఈ సాంగ్‌ను చిత్రీకరించే ప్లాన్‌లో చిత్రబృందం ఉందని తెలిసింది. అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top