కంగారేం లేదు | Anushka Shetty injures her leg while shooting for Sye Raa Narasimha Reddy | Sakshi
Sakshi News home page

కంగారేం లేదు

Jun 25 2019 2:36 AM | Updated on Jun 25 2019 5:07 AM

Anushka Shetty injures her leg while shooting for Sye Raa Narasimha Reddy - Sakshi

ఇటీవల కాలంలో హీరోలందరూ వరుసగా గాయపడుతున్నారు. తాజాగా అనుష్క కూడా గాయపడ్డారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో ఆమెకు ఏమైందో అని అనుష్క అభిమానులు  గాబరా పడ్డారు. అయితే అనుష్కకు గాయం అయిందనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిసింది. ‘సైరా: నరసింహారెడ్డి’ షూటింగ్‌ చేస్తూ అనుష్క గాయపడ్డారన్నది ప్రచారంలో ఉన్న వార్త. కానీ ‘సైరా’ సినిమా షూటింగ్‌ను అనుష్క ఎప్పుడో పూర్తిచేశారు. ఆమె పాత్ర మాత్రమే కాదు.. మొత్తం షూటింగ్‌ పూర్తయి పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉంది. ఆల్రెడీ చిరంజీవి డబ్బింగ్‌ కూడా స్టార్ట్‌ చేశారు. ఇందులో అనుష్క, చిరంజీవిలపై ఓ సాంగ్‌ ఉంటుందట. చాలా కొద్దిక్షణాలు మాత్రమే అనుష్క ‘సైరా’లో కనిపిస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో ‘నిశ్శబ్దం’ అనే చిత్రం చేస్తున్నారామె.

Advertisement
 
Advertisement
Advertisement