బంపర్ ఆఫర్! | anushka sharma in salman movie | Sakshi
Sakshi News home page

బంపర్ ఆఫర్!

Jan 10 2016 1:45 AM | Updated on Sep 3 2017 3:23 PM

బంపర్ ఆఫర్!

బంపర్ ఆఫర్!

బాలీవుడ్ కథానాయిక అనుష్కా శర్మ ఓ బంపర్ ఆఫర్ కొట్టేశారు.

 బాలీవుడ్ కథానాయిక అనుష్కా శర్మ ఓ బంపర్ ఆఫర్ కొట్టేశారు.  ప్రస్తుతం కరణ్‌జోహార్ నిర్మిస్తున్న ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న అనుష్క ఓ క్రేజీ ప్రాజెక్టును దక్కించుకున్నారు. ‘రబ్ నే బనాదే జోడీ’తో యశ్‌రాజ్ సంస్థ ద్వారా తెరంగేట్రం చేసిన ఈ అందాల తార మళ్లీ ఇదే సంస్థ నిర్మిస్తున్న ‘సుల్తాన్’ చిత్రంలో కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు జోడీగా నటించే చాన్స్ దక్కించుకున్నారు. ఈ చిత్ర కథాంశం ఓ రెజ్లర్ చుట్టూ సాగుతుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు.

మొదట్లో దీపికా పదుకొనే, కంగనా రనౌత్, కృతీసనన్, పరిణీతి చోప్రా లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చినా చివరికు అనుష్కా శర్మ వైపు  మొగ్గు చూపారు దర్శక-నిర్మాతలు.  ‘రబ్ నే బనాదే జోడీ’, ‘జబ్ తక్ హై జాన్’, ‘పీకే’ చిత్రాల్లో షారుక్‌ఖాన్, ఆమిర్‌ఖాన్‌లతో ఆన్ స్క్రీన్‌లో మంచి కెమిస్ట్రీ పండించిన అనుష్క, మరి సల్మాన్‌కి కూడా సరిజోడీ అనిపించుకుంటారా? లేదా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement