సన్నబడ్డ స్వీటీ! | Anushka Brother with selfie | Sakshi
Sakshi News home page

సన్నబడ్డ స్వీటీ!

May 16 2016 10:58 AM | Updated on Jul 26 2018 5:23 PM

అన్నయ్యతో ఓ సెల్ఫీ - Sakshi

అన్నయ్యతో ఓ సెల్ఫీ

చక్కనమ్మ ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. బొద్దుగా ఉన్నా, ముద్దుగానే అనిపిస్తుంటుంది. స్లిమ్‌గా ఉన్నా స్వీట్‌గా అనిపిస్తుంది.

చక్కనమ్మ ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. బొద్దుగా ఉన్నా, ముద్దుగానే అనిపిస్తుంటుంది. స్లిమ్‌గా ఉన్నా స్వీట్‌గా అనిపిస్తుంది. అందుకు నిదర్శనంగా అనుష్కను చెప్పొచ్చు. ‘సైజ్ జీరో’కి ముందు స్లిమ్‌గా ఉన్న అనుష్క అందర్నీ ఆకట్టుకుంటే, ఆ చిత్రంలో బొద్దుగా కనిపించి కూడా ఆకట్టుకున్నారు. ఆ సినిమా తర్వాత బరువు తగ్గే పనిలో పడ్డారామె. నాన్‌స్టాప్‌గా కసరత్తులు చేసిన స్వీటీ (అనుష్క ముద్దు పేరు) ఎట్టకేలకు సన్నబడ్డారు. ‘నేను సన్నబడ్డానోచ్’ అని అనుష్క చెప్పకపోయినా.. ఫేస్‌బుక్‌లో ఆమె పెట్టిన ఓ ఫొటో ఆ విషయాన్ని తెలియజేసింది.

షూటింగ్‌కి కాస్త గ్యాప్ దొరకడంతో అనుష్క తన సొంతూరు బెంగళూరు వెళ్లారు. అక్కడ తన అన్నయ్యతో కలిసి దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టారు అనుష్క. ఆ ఫొటో చూస్తే ముద్దుగుమ్మ మునుపటిలా ఉన్నట్లు తెలుస్తోంది కదూ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement