ప్రేమ ప్రదక్షణలు

Anupama proves to be a professional - Sakshi

ప్రేయసి కోసం ఓ కాలేజీ చుట్టూ ప్రేమ ప్రదక్షణలు చేస్తున్నారు హీరో రామ్‌. మరి... ఆయన ప్రేమ ఫలించడానికి ఈ ప్రదక్షణలు, వెయిటింగ్‌లు ఏ మాత్రం సాయం చేసాయన్నది సిల్వర్‌ స్క్రీన్‌పై తెలుస్తుంది. రామ్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా ‘నేను లోకల్‌’ ఫేమ్‌ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘హలో గురు ప్రేమకోసమే..’. ఇందులో అనుపమా పరమేశ్వరన్‌ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ అనుపమ పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సినిమాలో కీలకమైన కాలేజీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే కొన్ని నైట్‌ సీన్స్‌ను కూడా కెమెరాలో బంధిస్తున్నారు చిత్రబృందం. బావ–మరదళ్ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందట. రామ్‌ మామయ్య పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ కనిపిస్తారు.  టాకీ పార్ట్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్‌ 18న రిలీజ్‌ కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top