సౌత్‌ని చుట్టేశా

అంటున్నారు అనుపమా పరమేశ్వరన్. ఇలా ఎందుకంటున్నారంటే.. లేటెస్ట్‌గా పునీత్ రాజ్‌కుమార్‌తో ఓ కన్నడ సినిమా ఒప్పుకున్నారు అనుపమ. ఈ సినిమాతో సౌత్‌లో ఉన్న అన్ని భాషల్లో యాక్ట్ చేసిన హీరోయి¯Œ అవుతారు అనుపమ. మలయాళ ‘ప్రేమమ్’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ ఆ తర్వాత తెలుగులో ‘అ ఆ, ప్రేమమ్’ వంటి సినిమాల్లో యాక్ట్ చేశారు. ప్రస్తుతం రెండు మూడు తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అటు తమిళ వైపు వెళితే ధనుశ్ సరసన ‘కొడి’లో యాక్ట్ చేశారు.
కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం గురించి అనుపమ మాట్లాడుతూ - ‘‘పునీత్ రాజ్‌కుమార్ లాంటి స్టార్‌తో కన్నడకు ఎంట్రీ ఇవ్వడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. కన్నడ కూడా నేర్చుకోవచ్చని ఎగై్జటింగ్‌గా ఉంది. డైరెక్టర్ పవన్‌గారు స్టోరీ చెప్పిన విధానం ఆకట్టుకుంది. ఇందులో జూనియర్ లాయర్‌గా కనిపిస్తాను. నా పోర్షన్ షూటింగ్ ఆగస్ట్‌లో మొదలవుతుంది’’ అని పేర్కొన్నారు.