‘కంగనా ఓ రాక్‌స్టార్‌’

Anupam Kher Supports Manikarnika and Said Kangana Ranaut Is A Rockstar - Sakshi

ప్రస్తుతం బాలీవుడ్‌లో మణికర్ణిక వివాదంతో పాటు.. తన సహ నటులపై కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. నెపోటిజమ్‌ గురించి మాట్లాడినందునే ఇండస్ట్రీ అంతా తనకు వ్యతిరేకంగా ఉందని కంగనా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కంగనా నటనను మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారు. ట్విటర్‌ వేదికగా అనుపమ్‌ ఖేర్‌ నిర్వహించిన ‘ఆస్క్‌ మీ ఎనిథింగ్‌’ సెషన్‌లో ఒక నెటిజన్‌ ‘బాలీవుడ్‌లో కంగనా మణికర్ణిక సినిమాకు ఎవరు మద్దతు తెలపడం లేదు.. మీరు ఆమెకు మద్దతు తెలుపుతూ ట్వీట్‌ చేయండం’టూ అనుపమ్‌ను కోరాడు.

దాంతో అనుపమ్‌ ‘కంగనా ఓ రాక్‌ స్టార్‌. తనకు చాలా ప్రతిభ ఉంది. నేను తన ధైర్యాన్ని, నటనను ప్రశంసిస్తున్నాను. మహిళా సాధికారితకు తను నిలువెత్తు నిదర్శనం’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం అనుపమ్‌ చేసిన ట్వీట్‌ వైరలవుతోంది. ఇదిలా ఉండగా బంధుప్రీతి గురించి మాట్లాడినందునే బాలీవుడ్‌ మొత్తం గ్యాంగ్‌లా మారి తనను వ్యతిరేకిస్తున్నారంటూ కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అలియా భట్‌, ఆమిర్‌ ఖాన్‌ చిత్రాలు ‘దంగల్‌’, ‘రాజీ’ మూవీ ప్రమోషన్‌లకు తాను హాజరయ్యానని.. కానీ నేడు ధీర వనిత లక్ష్మీబాయి కథతో ముందుకు వస్తే తనకు ఎవరూ సహకరించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కంగనా వ్యాఖ్యలపై ఆలియా స్పందించడం.. క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధపడటం వంటి సంఘటనలు తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top