అనుకుంటున్నారట! | Anu Emmanuel in Dhanush-Nagarjuna film | Sakshi
Sakshi News home page

అనుకుంటున్నారట!

Sep 16 2018 1:45 AM | Updated on Jul 15 2019 9:21 PM

Anu Emmanuel in Dhanush-Nagarjuna film - Sakshi

అనూ ఇమ్మాన్యుయేల్‌

టాలీవుడ్‌లో వరుసగా టాప్‌ హీరోలతో జత కట్టిన అనూ ఇమ్మాన్యుయేల్‌ తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ కొట్టేశారని సమాచారం. అయితే ఇది టాలీవుడ్‌లో కాదు, కోలీవుడ్‌లో. ధనుష్‌ డైరెక్టర్‌గా ఇటీవల తన రెండో సినిమా స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ధనుష్‌ కూడా యాక్ట్‌ చేస్తున్నారు. ఓ ముఖ్య పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. అదితీ రావ్‌ హైదరీ ఓ కథానాయికగా నటిస్తున్నారు.

మరో నాయికగా అనూ ఇమ్మాన్యుయేల్‌ పేరును అనుకుంటున్నారట. శ్రీ తేనాండాళ్‌ ఫిల్మ్స్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తన భాగం షూటింగ్‌ కోసం వచ్చే నెల నుంచి సెట్స్‌లో జాయిన్‌ అవ్వనున్నారట ఈ మలయాళీ బ్యూటీ. ఆల్రెడీ ‘తుప్పరివాలన్‌’ (తెలుగులో డిటెక్టీవ్‌)తో తమిళంలోకి అడుగుపెట్టారామె. ఇది తన సెకండ్‌ మూవీ అవుతుంది. ప్రస్తుతం షూటింగ్‌ స్టార్ట్‌ అయిన ఈ చిత్రానికి సీయన్‌ రోల్డన్‌ సంగీత దర్శకుడు.

Advertisement
 
Advertisement
Advertisement