నాకు ఇంకో పేరుంది..! | Anothername to me | Sakshi
Sakshi News home page

నాకు ఇంకో పేరుంది..!

Jan 19 2016 11:29 PM | Updated on Sep 3 2017 3:55 PM

నాకు ఇంకో పేరుంది..!

నాకు ఇంకో పేరుంది..!

సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ హీరోగా బిజీ అయిపోతున్నారు. ఆయన హీరోగా ‘నాకు ఇంకో పేరుంది’ ............

సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ హీరోగా బిజీ అయిపోతున్నారు. ఆయన హీరోగా ‘నాకు ఇంకో పేరుంది’ పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఆనంది కథానాయిక. ‘రోబో-2’ నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ శ్యామ్ ఆంటోన్ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మిస్తోంది. ఇది యాక్షన్‌తో కూడిన చక్కని కుటుంబ కథాచిత్రమని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రం మొదటి ప్రచార చిత్రాన్ని బుధవారం ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన ట్విట్టర్  ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్. ప్రేమ్.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement