అన్నపూర్ణమ్మ మనవడు | Annapurnamma Gari Manavadu Movie First Look Launch | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణమ్మ మనవడు

Aug 6 2019 2:35 AM | Updated on Aug 6 2019 2:35 AM

Annapurnamma Gari Manavadu Movie First Look Launch - Sakshi

అన్నపూర్ణమ్మ, యం.ఎన్‌.ఆర్‌ చౌదరి, రవితేజ, శివనాగు, తారకరత్న

సీనియర్‌ నటులు అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలో, జమున కీలక పాత్రలో రూపొందిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. మాస్టర్‌ రవితేజ టైటిల్‌ రోల్‌ పోషించారు. నర్రా శివనాగేశ్వర్‌ రావు (శివనాగు) దర్శకత్వంలో యం.ఎన్‌.ఆర్‌ ఫిలిమ్స్‌ పతాకంపై యం.ఎన్‌.ఆర్‌ చౌదరి నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని నిర్మాత సి. కల్యాణ్‌ విడుదల చేశారు. అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ– ‘‘ చాలా కాలం తర్వాత మళ్లీ ఒక మంచి పాత్రలో నటించడం సంతోషంగా ఉంది. శివనాగు చాలా క్రమశిక్షణ ఉన్న దర్శకుడు. నా మనవడిగా నటించిన మాస్టర్‌ రవితేజ పుట్టుకతోనే నటన నేర్చుకొని వచ్చాడు’’ అన్నారు.

యమ్‌.ఎన్‌. ఆర్‌ చౌదరి మాట్లాడుతూ– ‘‘ఒక మంచి సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నందుకు సంతోషం. శివనాగు ఎంతో అందంగా ఈ చిత్రం తెరకెక్కించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో ఆడియో, అక్టోబర్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘పూర్తి పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రమిది.  200లకు పైగా థియేటర్స్‌లో సినిమాను విడుదల చేయనున్నాం’’ అని శివనాగు అన్నారు. ‘‘శివనాగుగారి దర్శకత్వంలో ‘దేవినేని’ సినిమా చేస్తున్నాను. సినిమా మీద ఎంతో ఇష్టంతో పని చేస్తారాయన’’ అన్నారు హీరో తారకరత్న.  సీనియర్‌ పాత్రికేయులు వినాయక రావు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: గిరికుమర్‌(గిరి),  సంగీతం: రాజ్‌ కిరణ్‌.

Advertisement
 
Advertisement
Advertisement