బాలీవుడ్ మూవీలో అన్నా హజరే | Anna hazare in Bachche Kachche Sachche | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ మూవీలో అన్నా హజరే

May 30 2017 3:31 PM | Updated on Sep 5 2017 12:22 PM

గాందేయవాది, అవినీతి పై పోరాట చేస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హజరే ఓ బాలీవుడ్ సినిమాలో అతిథి పాత్రలో

గాందేయవాది, అవినీతి పై పోరాట చేస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హజరే ఓ బాలీవుడ్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. తెలుగు దర్శకుడు రవి సదాశివ్ తెరకెక్కించిన బచ్చే కచ్చే సచ్చే సినిమా హజరే కొన్ని నిమిషాల పాటు కనిపించే చిన్న పాత్రలో నటించారు.  తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న కాన్సెప్ట్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

జూన్ 2న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి, ముఖేష్ తివారిలు ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు రవి సదాశివ్ స్వయంగా మీనా ఉద్దండతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో అథినేత, సరదాగా కాసేపు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన రవి సదాశివ్, బాలీవుడ్ సినిమా బచ్చే కచ్చే సచ్చే సినిమాకు దర్శకత్వ బాధ్యతలు కూడా తానే తీసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement