సీక్రెట్‌గా హీరోయిన్‌ నిశ్చితార్థం

Anisha Ambrose Was Engaged to Guna Jakka Last Month - Sakshi

ఒకప్పుడు టాలీవుడ్‌ లో హాట్‌ టాపిక్‌గా మారిన హీరోయిన్‌ అనీషా ఆంబ్రోస్‌. పవన్‌ కల్యాణ్ సరసన సర్థార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమాలో ఈ భామ హీరోయిన్‌గా నటించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆ అవకాశం అనీషా చేజారింది. తరువాత మనమంతా, ఒక్కడు మిగిలాడు లాంటి సినిమాల్లో నటించిన అనీషాకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న 7 సినిమాలో నటిస్తోంది అనీషా.

తాజాగా అనీషాకు సంబంధించిన మరో వార్త టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. త్వరలో ఈ భామ పెళ్లిపీటలెక్కనుందట. జేఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ ఈడీ గుణ జక్కను అనీషా పెళ్లి చేసుకోబోతోంది. అంతేకాదు ఇప్పటికే సీక్రెట్‌గా వీరి ఎంగేజ్మెంట్‌ కూడా జరిగిపోయిందట. ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు మాత్రమే హజరయ్యారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top