యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న సాంగ్ | Anirudh's Aaluma Doluma song crosses 1 crore views on YouTube | Sakshi
Sakshi News home page

యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న సాంగ్

Mar 6 2016 7:22 PM | Updated on Sep 3 2017 7:09 PM

యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న సాంగ్

యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న సాంగ్

స్టార్ హీరో అజిత్ నటించిన వేదలం సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.

స్టార్ హీరో అజిత్ నటించిన వేదలం సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ సినిమా లోని ఓ పాటకు ఏకంగా కోటి హిట్స్ వచ్చాయి. 'ఆలుమా డోలుమా' అనే సాంగ్ లిరిక్స్ తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. రికార్డులు తిరగరాస్తోదంటే అతిశయోక్తి కాదు. గతంలో అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన '3' లేదా 'త్రీ' సినిమాలో 'వై దిస్ కోలవెరి' అనే సాంగ్ రికార్డులు నెలకొల్పింది. ఆ పాటకు అనిరుద్ సంగీత దర్శకుడిగా చేయగా, హీరో ధనుష్ ఆ పాటను పాడిన విషయం తెలిసిందే. 'వై దిస్ కోలవెరి డి' ఈ ఐదేళ్లలో 10 కోట్ల హిట్స్ ను సొంతం చేసుకుంది. 'ఆలుమా డోలుమా' అనే సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో కోటి హిట్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. ఆ పాటకు గౌరవ సంగీత దర్శకత్వం వహించడంతో పాటు స్వయంగా అనిరుధ్ గాత్రదానం చేశాడు.

అందుకే అతడు డబుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.  తాజాగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'వేదలం' సినిమా మంచి సక్సెస్ను అందుకుంది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సూపర్ హిట్ జోరు చూపిస్తోంది. ఏ సెంటర్స్లో పెద్దగా వర్క్అవుట్ కాకపోయినా.. బి, సి సెంటర్స్లో అజిత్ జోరు కనిపిస్తోంది. ఈ సక్సెస్తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సక్సెస్ సాధించిన హీరోయిన్గా శృతిహాసన్ ప్రూవ్ చేసుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement