ఎన్టీఆర్ కోసం కొలవెరి కుర్రాడు..! | Anirudh music for Ntr Trivikram Movie | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ కోసం కొలవెరి కుర్రాడు..!

Aug 29 2017 1:58 PM | Updated on Sep 17 2017 6:06 PM

ఎన్టీఆర్ కోసం కొలవెరి కుర్రాడు..!

ఎన్టీఆర్ కోసం కొలవెరి కుర్రాడు..!

ఇంత వరకు అధికారిక ప్రకటన రాకపోయినా.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ల కాంబినేషన్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంత వరకు అధికారిక ప్రకటన రాకపోయినా.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ల కాంబినేషన్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందంటూ ప్రచారం మాత్రం గట్టిగానే జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణుల పేర్లు కూడా బయటకు వచ్చేస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ ను హీరోయిన్ గా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతుండగా.. తాజాగా సంగీత దర్శకుడు కూడా ఫైనల్ అయ్యాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు సంగీతమందిస్తున్న అనిరుధ్, ఎన్టీఆర్ సినిమాకు కూడా పనిచేయనున్నాడట. ప్రస్తుతం జై లవ కుశ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, నవంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమా ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement