అందుకే వరుసగా 8 విజయాలు సొంతమయ్యాయి..!! | Anil Kapoor Feels Very Proud Of Sonam Kapoor As She Got 8 Hits In A Row | Sakshi
Sakshi News home page

అందుకే వరుసగా 8 విజయాలు సొంతమయ్యాయి..!!

Jul 2 2018 7:14 PM | Updated on Jul 2 2018 7:58 PM

Anil Kapoor Feels Very Proud Of Sonam Kapoor As She Got 8 Hits In A Row - Sakshi

తండ్రి అనిల్‌ కపూర్‌తో సోనమ్‌ కపూర్‌

బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ తన గారాల కూతురు సోనమ్‌ కపూర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. సినీ రంగంలో కూతురి విజయాలను ప్రస్తావిస్తూ ... ‘జీవితాన్ని తీర్చిదిద్దడంలో మన ఎంపిక చేసుకునే అంశాలే కీలక పాత్ర పోషిస్తాయి. సోనమ్‌.. స్క్రిప్టులు, డైరెక్టర్లు, కంటెంట్‌ విషయాల్లో నువ్వు చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నావ్‌. వృత్తి పట్ల నిబద్ధత, నీ కఠోర శ్రమల ఫలితంగానే వరుసగా 8 విజయాలు నీ సొం‍తమయ్యాయి...! చాలా సంతోషంగా ఉంది. నిన్ను చూసి నేనెంతో గర్వపడుతున్నాను’  అంటూ అనిల్‌ కపూర్‌ ట్వీట్‌ చేశారు.

సోనమ్‌ హిట్‌ సినిమాలు... నీర్జా, రాంజానా, భాగ్‌ మిల్కా భాగ్‌, ప్యాడ్‌మాన్‌, ఖూబ్‌సూరత్‌, ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో, వీరే ది వెడ్డింగ్‌, సంజు సినిమాలకు సంబంధించిన పోస్టర్ల ఫొటోల సమాహారాన్ని అనిల్‌ కపూర్‌ తన ట్వీట్‌తో పాటుగా షేర్‌ చేశారు. 2007 లో ‘సావరియా’  సినిమాతో బాలీవుడ్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సోనమ్‌.. మొదట్లో సరైన హిట్లు లేక సతమతమైంది. కానీ తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆమె నటించిన తాజా చిత్రాలు వీరే ది వెడ్డింగ్‌, సంజులు హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాయి.  ప్రస్తుతం రాజ్‌ కుమార్‌కు జంటగా నటిస్తోన్న ‘ఏక్‌ లడ్‌కీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాలో సోనమ్‌ కపూర్ తండ్రితో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతోంది ‌.

Advertisement
 
Advertisement
Advertisement