ఆ హీరో, హీరోయిన్ వైవాహిక బంధం బద్దలైంది | Angelina Jolie Files For Divorce From Brad Pitt says he is neglcting family | Sakshi
Sakshi News home page

ఆ హీరో, హీరోయిన్ వైవాహిక బంధం బద్దలైంది

Sep 21 2016 8:41 AM | Updated on Sep 4 2017 2:24 PM

ఆ హీరో, హీరోయిన్ వైవాహిక బంధం బద్దలైంది

ఆ హీరో, హీరోయిన్ వైవాహిక బంధం బద్దలైంది

హాలీవుడ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ కపుల్స్ ఎంజెలీనా జోలీ(41), ఆస్కార్ ఆవార్డు విజేత బ్రాడ్ ఫిట్(52) విడిపోతున్నారు. పన్నేండేళ్ల బంధానికి, రెండున్నారేళ్ల వైవాహిక జీవితానికి గుడ్బై చెప్పేస్తున్నారు.

లండన్: హాలీవుడ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ కపుల్స్ ఎంజెలీనా జోలీ(41), ఆస్కార్ ఆవార్డు విజేత బ్రాడ్ ఫిట్(52) విడిపోతున్నారు. పన్నేండేళ్ల బంధానికి, రెండున్నారేళ్ల వైవాహిక జీవితానికి గుడ్బై చెప్పేస్తున్నారు. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి మధ్యలో మరో అమ్మాయి రావడమే అందుకు ప్రధాన కారణమైంది. ఎంజెలీనా, బ్రాడ్ ఫిట్లకు 2014లో వివాహం అయింది. అంతకుముందు పన్నెండేళ్లపాటు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. 2004 నుంచి వీరిద్దరు ఒకే ఇంట్లో ఉండటమే కాకుండా మంచి కపుల్స్ అని పేరు కూడా తెచ్చుకున్నారు.

అయితే, కొద్ది రోజులుగా బ్రాడ్ వ్యవహారంలో అసంతృప్తిగా ఉన్న జోలీ అటార్న్ రాబర్ట్ వద్ద తనకు బ్రాడ్ ఫిట్ నుంచి విడాకులు ఇప్పించాలని దరఖాస్తు చేసుకొంది. తన కుటుంబ క్షేమం కోసమే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పింది. ఈ సమయంలో కుటుంబం విషయంలో ప్రైవసీ కోరుకుంటున్నందున తన విడాకులు కోరుతున్నట్లు వెల్లడించింది. బ్రాడ్ ఫిట్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 'ఈ విషయం చెప్పేందుకు బాధగా ఉంది. మా చుట్టూ కొన్ని కారణాల వల్ల ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మీడియా మాకు కొంత స్వేచ్ఛను ఇవ్వాలి' అని ఆయన చెప్పారు.

బ్రాడ్ ఫిట్, ఎంజెలీనాకు ఆరుగురు పిల్లలు కాగా వారిలో ముగ్గురు దత్తత తీసుకున్నవారు ఉన్నారు. మిగితా ముగ్గురు జోలీ, బ్రాడ్ ఫిట్ కు కలిగిన సంతానమే. తన పిల్లలను సరిగా చూసుకోవడం లేదని తన విడాకుల దరఖాస్తులో పేర్కొన్న ఎంజెలీనా.. కావాలంటే అప్పుడప్పుడు బ్రాడ్ ఫిట్ వచ్చి చూసి వెళుతుండొచ్చని అందులో పేర్కొంది. అతడి వద్ద నుంచి ఎంజెలీనా భరణం కూడా కోరలేదు. 2004లో వీరిద్దరు ప్రేమలో పడ్డప్పుడు బ్రాడ్ కు జెన్నిఫర్ అనిస్టన్ అనే ఓ మోడల్ భార్యగా ఉంది. అయితే, బ్రాడ్ తో ఎంజెలీనా విడిపోయేందుకు ప్రధాన కారణం మాత్రం ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత బ్రాడ్ ఫిట్ ఓ మోడల్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటమే కాకుండా ఇంటి సంగతులు పక్కకు పెట్టినట్లు హాలీవుడ్ లో గుసగుసలు. అయితే, ఇలా విడిపోవడం హాలీవుడ్ లో సాధారణ విషయమే.

Advertisement
 
Advertisement
Advertisement