సల్మాన్‌ షూటింగ్‌లో అపశ్రుతి | The Ancient Statue Was Destroyed in Dabangg 3 Shooting | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ షూటింగ్‌లో అపశ్రుతి

Apr 8 2019 12:37 PM | Updated on Apr 8 2019 12:52 PM

The Ancient Statue Was Destroyed in Dabangg 3 Shooting - Sakshi

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న తాజా చిత్రం దంబాగ్‌ 3. దంబాగ్, దబాంగ్‌ 2 చిత్రాలు ఘనవిజయం సాధించటంతో ఈ సీక్వెల్‌పై భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. సల్మాన్‌ సోదరుడు నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ మధ్యప్రదేశ్‌లోని అహల్య కోటలో జరుగుతోంది.

అయితే షూటింగ్ కోసం సామాన్లు తరలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కోటలోని ఓ పురాతన విగ్రహం ధ్వసమైంది. ప్రస్తుతం ధ్వంసమైన విగ్రహం ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. తాళ్ల సాయంతో షూటింగ్‌కు సంబంధించిన వస్తువులు పైకి లాగుతుండగా అవి విగ్రహానికి తగిలి చేయి విరిగిపోయినట్టుగా తెలుస్తోంది. పురాతన విగ్రహం ధ్వంసం కావటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement