ఇప్పుడు వెండితెరపై... | Anchor Ravi turns a hero | Sakshi
Sakshi News home page

ఇప్పుడు వెండితెరపై...

Mar 4 2017 11:47 PM | Updated on Sep 5 2017 5:12 AM

ఇప్పుడు వెండితెరపై...

ఇప్పుడు వెండితెరపై...

బుల్లితెరపై లేడీ యాంకర్ల హవా నడుస్తున్న ప్రస్తుత టైమ్‌లో మేల్‌ యాంకర్‌గా తానేంటో ప్రూవ్‌ చేసుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందాడు రవి.

బుల్లితెరపై లేడీ యాంకర్ల హవా నడుస్తున్న ప్రస్తుత టైమ్‌లో మేల్‌ యాంకర్‌గా తానేంటో ప్రూవ్‌ చేసుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందాడు రవి. ఇప్పటివరకు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రవి హీరోగా వెండితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు.

రవి హీరోగా అయోధ్య కార్తీక్‌ దర్శకత్వంలో మత్స్య క్రియేషన్స్ పతాకంపై ‘ఇది మా ప్రేమకథ’ పేరుతో ఓ చిత్రం రూపొందింది. ‘1 ఈజ్‌ గ్రేటర్‌ దేన్ ’ అన్నది ఉప శీర్షిక. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఇదొక ఫీల్‌ గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌. రవి సరసన ఇద్దరు కథానాయికలు నటించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్  పనులు జరుగుతున్నాయి. రవి ఫస్ట్‌ లుక్‌ను త్వరలో ఓ సెలబ్రిటీ విడుదల చేయ నున్నారు. ఏప్రిల్‌లో సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: పి.ఎల్‌.కె.రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement