హీరోయిన్గా మరో టీవీ యాంకర్ | Anchor Lasya Raja meeru Keka movie first look | Sakshi
Sakshi News home page

హీరోయిన్గా మరో టీవీ యాంకర్

Jan 5 2017 1:42 PM | Updated on Sep 5 2017 12:30 AM

హీరోయిన్గా మరో టీవీ యాంకర్

హీరోయిన్గా మరో టీవీ యాంకర్

బుల్లితెర మీద యాంకర్లుగా స్టార్ ఇమేజ్ అందుకున్న చాలా మంది, హీరోయిన్లుగా మారేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే రష్మీ, అనసూయ లాంటి వారు ఈ రేసులో

బుల్లితెర మీద యాంకర్లుగా స్టార్ ఇమేజ్ అందుకున్న చాలా మంది, హీరోయిన్లుగా మారేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే రష్మీ, అనసూయ లాంటి వారు ఈ రేసులో ముందుండగా ఇప్పుడు మరో భామ ఈ లిస్ట్లో చేరేందుకు రెడీ అవుతోంది. పలు రియాల్టీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరించిన యాంకర్ లాస్య హీరోయిన్గా పరిచయం అవుతోంది.

గుంటూరు టాకీస్ సినిమాను నిర్మించిన ఆర్ కె స్టూడియోస్ బ్యానర్లో కృష్ణ కిశోర్.టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా 'రాజా మీరు కేక'. రేవంత్, నోయోల్, మిర్చీ హేమంత్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో లాస్య హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఈ సినిమా కోసం కొద్ది రోజులుగా బుల్లితెరకు కూడా దూరమైన ఈ బ్యూటీ.., సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉంది. మరి లాస్య కూడా రష్మీ, అనసూయల బాటలో వెండితెర మీద కూడా సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement