breaking news
Raja meeru Keka
-
క్లైమాక్స్‌లో కేక...
నందమూరి తారకరత్న, రేవంత్, నోయెల్, ‘మిర్చి’ హేమంత్... ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయిన ‘రాజా మీరు కేక’లో ఈ నలుగురూ కీలక పాత్రలు చేశారు. నలుగురిలో రాజు ఎవరు? అనడిగితే... ‘వచ్చే నెల వరకూ ఆగండి. సినిమా చూపిస్తాం’ అని టి. కృష్ణకిశోర్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్. ఎం ఈ చిత్రం నిర్మించారు. యాంకర్ లాస్య ఓ హీరోయిన్గా నటించారు. ఆడియో ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘కొత్త కథతో తీసిన చిత్రమిది. క్లైమాక్స్‌లో తారకరత్న నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటుంది. అంత అద్భుతంగా నటించారు’’ అన్నారు కృష్ణ కిశోర్. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్. -
హీరోయిన్గా మరో టీవీ యాంకర్
బుల్లితెర మీద యాంకర్లుగా స్టార్ ఇమేజ్ అందుకున్న చాలా మంది, హీరోయిన్లుగా మారేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే రష్మీ, అనసూయ లాంటి వారు ఈ రేసులో ముందుండగా ఇప్పుడు మరో భామ ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతోంది. పలు రియాల్టీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరించిన యాంకర్ లాస్య హీరోయిన్గా పరిచయం అవుతోంది. గుంటూరు టాకీస్ సినిమాను నిర్మించిన ఆర్ కె స్టూడియోస్ బ్యానర్లో కృష్ణ కిశోర్.టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా 'రాజా మీరు కేక'. రేవంత్, నోయోల్, మిర్చీ హేమంత్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో లాస్య హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఈ సినిమా కోసం కొద్ది రోజులుగా బుల్లితెరకు కూడా దూరమైన ఈ బ్యూటీ.., సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉంది. మరి లాస్య కూడా రష్మీ, అనసూయల బాటలో వెండితెర మీద కూడా సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.