ఫైటర్‌కు జోడి?

Ananya Pandey to Play Lead for Vijay Devarakonda Next - Sakshi

మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుని ఫుల్‌ ప్రిపేర్డ్‌గా ఉన్నారు విజయ్‌ దేవరకొండ. ఇక రంగంలోకి దిగడమే ఆలస్యం. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నా«థ్‌ దర్శకత్వంలో ‘ఫైటర్‌’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్‌ సిక్స్‌ప్యాక్‌తో కనిపిస్తారు. ఈ సినిమాలో  చేయబోయే ఫైట్స్‌ కోసం విజయ్‌ థాయ్‌ల్యాండ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ వారంలో ముంబైలో ప్రారంభం కానుందని తెలిసింది.

ఈ సినిమాలో కథనాయికగా ఇప్పటికే చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ అనన్యా పాండే పేరు తెరపైకి వచ్చింది. మరి.. ఫైటర్‌కు అనన్య జోడీ అవుతారా? ఈ సినిమాతో సౌత్‌కు ఎంట్రీ ఇస్తారా? వెయిట్‌ అండ్‌ సీ. ఇదిలా ఉంటే ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా అనన్య వెండితెర ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత  కార్తీక్‌ ఆర్యన్‌‘పతీపత్నీ ఔర్‌ ఓ’ చిత్రంలో నటించి మంచి పేరు సంపాదించుకున్న అనన్య ప్రస్తుతం ‘ఖాలీ పీలి’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top