కాలేజీ రోజులే ఆనందానికి కేరాఫ్‌ | Anandam Movie Release in March | Sakshi
Sakshi News home page

కాలేజీ రోజులే ఆనందానికి కేరాఫ్‌

Mar 12 2018 5:00 AM | Updated on Mar 12 2018 5:00 AM

Anandam Movie Release in March - Sakshi

సిద్ధి మహాజన్‌కట్టి

కాలేజ్‌ రోజులు, కాలేజ్‌ క్యాంపస్‌లో సరదాగా  గడిపే క్షణాలే ఆనందానికి కేరాఫ్‌ అడ్రస్‌. ఇంజనీరింగ్‌ కాలేజ్‌ నాలుగు రోజుల ఇండస్ట్రియల్‌ టూర్‌లో మూడు ప్రేమ జంటల మధ్య జరిగే కథతో వచ్చిన మలయాళ సూపర్‌ హిట్‌ సినిమా ‘ఆనందం’. ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో ఈ నెల 23న విడుదల చేస్తున్నారు సుఖీభవ మూవీస్‌ ఎత్తురి గురురాజ్‌.

ఆయన మాట్లాడుతూ – ‘‘డబ్బింగ్‌ వర్క్‌ దాదాపు పూర్తి అయింది. ఈ నెల 17న గ్రాండ్‌గా ఆడియో రిలీజ్‌ చేస్తాం. సచిన్‌ వారియర్‌ స్వరపరిచిన మ్యూజిక్‌కు వనమాలి చక్కటి సాహిత్యం అందించారు. ‘హ్యాపీడేస్‌’ తరహాలోనే ఈ సినిమా ఆకట్టుకుంటుంది. చాలా మంది నిర్మాతలు రీమేక్‌ చేస్తాం అన్నా కూడా కథ మీద నమ్మకంతో అనువదిస్తున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు సహనిర్మాతలు: వీరా వెంకటేశ్వరరావు, వీఆర్‌బీ రాజు, రవి వర్మ చిలువూరి, దర్శకత్వం: గణేశ్‌ రాజ్‌.

Advertisement
 
Advertisement
Advertisement