అందుకే కొడుకు పేరు మార్చాను: న‌టి | Amy Schumer Changed Her Son Name For Funny Reason | Sakshi
Sakshi News home page

ఆ రీజ‌న్‌తో కొడుకు పేరు మార్చిన న‌టి

Apr 15 2020 1:59 PM | Updated on Apr 15 2020 2:02 PM

Amy Schumer Changed Her Son Name For Funny Reason - Sakshi

అమెరిక‌న్‌‌ స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌‌ అమీ స్కూమ‌ర్ కొడుకు పేరు మార్చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ప‌ద‌కొండు నెల‌ల బాబుకు ఇప్పుడు పేరు మార్చాల్సిన పనేంటా అని ఆలోచిస్తున్నారా? దాని కార‌ణం తెలిస్తే మంచి ప‌ని చేశార‌ని మీరే మెచ్చుకుంటారు. అమీ స్కూమ‌ర్, క్రిస్‌ ఫిష‌ర్ దంప‌తుల‌కు గ‌తేడాది మేలో బాబు జ‌న్మించాడు. అనికి జీన్ అట్ట‌ల్ ఫిష‌ర్ అని నామ‌క‌ర‌ణం చేశారు. ఈ పేరు మ‌ధ్య‌లో ఉన్న అట్ట‌ల్ అనే ప‌దం ప్ర‌ముఖ‌ హాస్య‌న‌టుడు, స్నేహితుడు డేవ్ అట్టల్‌కు గుర్తుగా పెట్టుకున్నారు. అంతా బానే ఉంది కానీ, జీన్ అట్ట‌ల్ అనే పేరు కాస్తా పిలిచేట‌ప్పుడు రెండూ క‌లిసిపోయి జెనిట‌ల్(జ‌న‌నేంద్రియం) అని స్ఫురిస్తుంది. (డ్రగ్స్‌ ఇచ్చి నాపై అత్యాచారం చేశారు)

దీంతో నాలుక్క‌రుచుకున్న న‌టి ఆల‌స్యంగానైనా పొర‌పాటును దిద్దుకునే ప‌నిలో ప‌డింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. త‌న కొడుకు పేరు మార్చిన సంగ‌తి మీకు తెలుసా అని ప్ర‌శ్నించింది. తెలియ‌క‌పోతే ఇప్పుడైనా తెలుసుకోండి అంటూ కొడుకు పేరును జీన్ డేవిడ్ ఫిష‌ర్‌గా మార్చిన‌ట్లు ప్ర‌కటించింది. పాత పేరులో ఉన్న త‌ప్పును త‌న త‌ల్లి మొద‌ట‌గా గుర్తించింద‌ని చెప్పుకొచ్చింది. అయితే ఇంకా వివిధ ర‌కాలుగా పిలిచే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ జెనిట‌ల్ అనే సౌండ్ వ‌స్తుండ‌టంతో ఆ పేరును తీసేయ‌డ‌మే మంచిద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చింది‌‌ అమీ స్కూమ‌ర్. (పిల్లలు పస్తులు ఉండకూడదు)

Advertisement
 
Advertisement
Advertisement