ప్రపంచ కప్‌కు ప్రాక్టీస్‌

Amitabh Bachchan play my role in Jhund - Sakshi

2022 సాకర్‌ ప్రపంచ కప్‌ కోసం ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు అమితాబ్‌ బచ్చన్‌. అందుకే ఫుట్‌బాల్‌ పట్టుకుని గ్రౌండ్‌లో దిగారు. అప్పుడే సాకర్‌ ఫీవర్‌ ఎందుకంటే.. బిగ్‌ బి లేటెస్ట్‌ సినిమా కోసమే. మరాఠీ బ్లాక్‌బస్టర్‌ ‘సైరాట్‌’ దర్శకుడు నాగరాజ్‌ దర్శకత్వంలో అమితాబ్‌ ‘జుంద్‌’ అనే చిత్రంలో యాక్ట్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా కనిపించనున్నారు. తన కోచింగ్‌తో వీధి బాలలను ఎలా విజయం సాధించేలా చేశారనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు అమితాబ్‌. ఈ చిత్రం షూటింగ్‌ లొకేషన్‌లోని ఫొటో షేర్‌ చేస్తూ ‘‘ప్రపంచ కప్‌కు ప్రాక్టీస్‌ చేస్తున్నాను’’ అని సరదాగా పేర్కొన్నారు బిగ్‌ బి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top