పాతికేళ్ల తర్వాత...!

Amitabh Bachchan to play himself in Vikram Gokhale is Marathi film - Sakshi

రాబోయే రెండేళ్లకు సరిపడ సినిమాలు బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ బ్యాంకులో ఉన్నాయి. వరుసగా సినిమాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ ౖడైరీని ఫుల్‌గా ఉంచుతున్నారు. తాజాగా మరో మరాఠి సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు అమితాబ్‌ బచ్చన్‌. ఈ చిత్రానికి మిలింద్‌ లేలేస్‌ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో ఇటీవల  మొదలైంది. విక్రమ్‌ ఘోఖలే ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఫ్యామిలీ డ్రామా అండ్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమాకు ‘ఏబీ అండ్‌ సీడీ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. అయితే దాదాపు పాతికేళ్ల తర్వాత మరాఠి సినిమాలో నటిస్తున్నారు అమితాబ్‌. 1994లో వచ్చిన ‘అకా’ సినిమాలో ఓ గెస్ట్‌ రోల్‌ చేసిన అమితాబ్, 2006లో ఓ మరాఠి సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. 2010 ‘విహిర్‌’ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించారు. అంతేకానీ నటించలేదు. ఇప్పుడు పాతికేళ్ల తర్వాత ఓ ఫుల్‌లెంగ్త్‌ రోల్‌తో మళ్లీ మరాఠి వెండితెరపై కనిపించబోతున్నారు అమితాబ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top