అమితాబ్ నాకు స్క్రీన్ ఐడాల్:చిత్రాంగద సింగ్ | Amitabh Bachchan is my screen idol:Chitrangda Singh | Sakshi
Sakshi News home page

అమితాబ్ నాకు స్క్రీన్ ఐడాల్:చిత్రాంగద సింగ్

Dec 2 2013 6:20 PM | Updated on Apr 3 2019 6:23 PM

అమితాబ్ నాకు స్క్రీన్ ఐడాల్:చిత్రాంగద సింగ్ - Sakshi

అమితాబ్ నాకు స్క్రీన్ ఐడాల్:చిత్రాంగద సింగ్

‘పెహలే ఆప్ జనాబ్’ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సరసన నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది నటి చిత్రాంగద సింగ్.

ముంబై: ‘పెహలే ఆప్ జనాబ్’ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సరసన నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది నటి చిత్రాంగద సింగ్. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. నగరంలో ఆదివారం రాత్రి జరిగిన యాంబీవ్యాలీ ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నటి చిత్రాంగద సింగ్ తరుణ్ తహిల్యానీ రూపొందించిన ఎర్ర లెహంగాతో నడి చింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘స్క్రీన్ ఐడాల్ సరసన నటించే అవకాశం నాకు రావడంతో చిన్ననాటి కల నిజమైందా అనిపిస్తోంది.

అమితాబ్‌బచ్చన్‌కు అంత సమయం ఉండదు. చిన్ననాటినుంచే నాకు ఆయన స్క్రీన్ ఐడాల్. నాకు ఈ విషయం ఎంతో ఉల్లాసం, ఉత్సాహంగా కలిగించింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ ఆరంభమవుతుంది’ అని చిత్రాంగద తెలిపింది. ‘పెహలే ఆప్ జనాబ్’ సినిమాలో చిత్రాంగద గురువు సుధీర్ శర్మ కూడా నటిస్తున్నాడు. గతంలో హజారోం ఖ్వాయిషే ఐసీ, యే సాలీ జిందగీ, ఇన్కార్ సినిమాలలో వీరిరువురూ కలసి పనిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement