ముద్దు గొడవ! | American Idol contestant says Katy Perry's kiss was not harassment | Sakshi
Sakshi News home page

ముద్దు గొడవ!

Mar 19 2018 12:32 AM | Updated on Apr 4 2019 3:48 PM

American Idol contestant says Katy Perry's kiss was not harassment - Sakshi

ల బెంజమిన్‌ గ్లేజ్‌, కేటీ పెరీ

‘‘నువ్వెప్పుడైనా, ఎవరినైనా కిస్‌ చేశావా?’’ అనడిగింది పాపులర్‌ సింగర్‌ కేటీ పెరీ, 20 ఏళ్ల బెంజమిన్‌ గ్లేజ్‌ని. అమెరికన్‌ ఐడల్‌ షోలో కంటెస్టెంట్‌ అతను. ఆమె జడ్జి. బెంజమిన్‌ లేదన్నాడు. అయితే నాకొక ముద్దివ్వు అనడిగింది కేటీ, అతను ఆమె చెంపమీద ఒక ముద్దు పెట్టాడు. ‘ఇలాగా?’ అంటూ అతను ఊహించని రీతిలో గ్లేజ్‌ పెదాల మీద ముద్దు పెట్టింది కేటీ. చిన్న కుర్రాడు. అందులోనూ అంతకుముందు ఎప్పుడూ కిస్‌ చెయ్యలేదు. కంగారు పడిపోయి, బాగా ఇబ్బంది పడ్డాడు. ఆ విషయమే తర్వాత అందరికీ చెప్పాడు. గొడవ అప్పుడు మొదలైంది. కేటీ పేరీ చేసిన పని ఏ రకంగా చూసినా అబ్యూజ్‌ కిందకే వస్తుందని అన్నారంతా.

‘ఇదే పని ఒక మేల్‌ జడ్జి చేస్తే ఏం చేసేవారు?’ అని గొడవ చేశారు. ముందు ఇద్దరిద్దరే కామెంట్‌ చేశారు. ఆ తర్వాత ఈ ముద్దు గొడవ పెద్దదైపోయింది. ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఈ ముద్దు గొడవే! ఇదింకా పెద్దదవుతుందనుకున్నాడో ఏమో, గ్లేజ్‌ బయటకొచ్చి చెప్పాడు.. ‘‘నేను ఇబ్బందిగా ఫీలియిన మాట వాస్తవమే. నా ఫస్ట్‌ కిస్‌ నా గర్ల్‌ఫ్రెండ్‌తో ఉండాలనుకున్నా. కేటీ పెరీ స్ట్రేంజర్‌. ఆమె అలా కిస్‌ చేస్తే ఇబ్బందనిపించింది. అంతేకానీ అదేమీ అబ్యూజ్‌ కాదు. హరాస్‌మెంట్‌ అంతకన్నా కాదు’’. మొత్తానికి గ్లేజ్‌ ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్‌తో గొడవైతే మొత్తం సద్దుమణిగిపోయింది. కానీ ముద్దు ఇంకా ఆన్‌లైన్లో సెన్సేషనే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement