ఎ టు ఎ | Ameerpet to America poster unveiled | Sakshi
Sakshi News home page

ఎ టు ఎ

Jan 6 2018 12:31 AM | Updated on Jan 6 2018 12:31 AM

Ameerpet to America poster unveiled - Sakshi

అమీర్‌పేట నుంచి ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టాలనుకునే యువత ఆశయాలు ఏంటి? అమెరికా వెళ్లడానికి ఎలాంటి తిప్పలు పడ్డారు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఎ టు ఎ’(అమీర్‌పేట టు అమెరికా). బ్రహ్మానందం, తనికెళ్ల, వేణు మాధవ్, వైవా హర్ష తదితరులు నటించారు. భానుకిరణ్‌ చల్లా దర్శకత్వంలో మదన్‌ కొమండూరి, పద్మజ కొమండూరి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అయిన రామ్మోహన్‌ కొమండూరి మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్‌ లవ్‌ అండ్‌ కామెడీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ప్రీ ప్రొడక్షన్‌ నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వరకూ నేను సహకారం అందించడంవల్ల కర్త, కర్మ, క్రియ అన్నాం. 80 శాతం చిత్రీకరణ అమెరికాలో జరిపాం. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఈ చిత్రంలో బోనాల పాట తీశాం. త్వరలో ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: స్వప్న కొమండూరి, కెమెరా: అరుణ్, జి.ఎల్‌.బాబు, సంగీతం: కార్తీక్‌ కొడగండ్ల.

Advertisement
 
Advertisement
Advertisement