ఏం చేస్తుంటారు?

amar akbar anthony teaser release date fix - Sakshi

ఇటీవల వచ్చిన ఫస్ట్‌ లుక్‌తో ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ ఎలా ఉంటారో తెలిసింది. మరి ఈ ముగ్గురు ఏం చేస్తుంటారు? ఎలా మాట్లాడతారో చూపించడానికి శాంపిల్‌గా టీజర్‌ను రిలీజ్‌ చేయడానికి సిద్ధమయ్యారు టీమ్‌. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మించిన సినిమా ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’. ఇలియానా కథానాయిగా నటించారు.

బాలీవుడ్‌కి వెళ్లిన ఇలియానా ఈ సినిమాతోనే మళ్లీ సౌత్‌కి తిరిగొస్తున్నారు.‘‘శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా రిలీజైన గ్లిమ్స్‌ ఆఫ్‌ అమర్‌ అక్బర్‌ ఆంటొనికి మంచి స్పందన వచ్చింది. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో రవితేజ డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 29న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. సునీల్, లయ, ‘వెన్నెల’ కిశోర్, రవి ప్రకాష్, తరుణ్‌ అరోరా కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top